దాములూరు–కూడలి జాతరకు ప్రత్యేక బస్సులు
దాములూరు–కూడలి జాతరకు ప్రత్యేక బస్సులు కాకతీయ, మధిర : మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న నిర్వహించే దాములూరు–కూడలి జాతరకు భక్తుల సౌకర్యార్థం మధిర నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ మధిర డిపో మేనేజర్ ఆర్. రామయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి మధిర బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదే విధంగా జాతర సందర్భంగా స్వామివారి కళ్యాణం ముగిసే...