లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటం ముమ్మరం చేయాలి
లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాటం ముమ్మరం చేయాలి కాకతీయ, పెద్దవంగర: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను అణచివేసే విధంగా ఉన్నాయని, వాటిని తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులను బానిసలుగా మార్చే విధంగా రూపొందించిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాన్ని రూ.26,000గా...