కల్లూరు కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

కల్లూరు కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత మూడు అంచెల నిఘా… అనధికార వస్తువులకు అనుమ‌తి లేదు ఏసీపీ వసుంధర యాదవ్ కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పాటు పోలీసు నిఘా కొనసాగుతోందని, మూడు అంచెల భద్రతా వ్యవస్థ అమలులో ఉందన్నారు. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు, పెన్నులు, ఇంక్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు...