కార్మికుల హక్కులు కాపాడాలి
కార్మికుల హక్కులు కాపాడాలి కాకతీయ, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్పత్రి వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా నుంచి కోర్టు వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఒక నెల వేతనాలను వెంటనే చెల్లించాలని,...