ములుగులో కాంగ్రెస్ దూకుడు..!
ములుగులో కాంగ్రెస్ దూకుడు..! ఇప్పటికే 5 వార్డుల్లో కాంగ్రెస్ విజయం 2 వార్డుల్లో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ భారీ మెజార్టీలతో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం వార్డుల ఫలితాలు దశలవారీగా వెలువడుతున్న క్రమంలో ఇప్పటికే ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి ముందంజలో నిలిచారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రెండు వార్డుల్లో గెలుపొందుతూ తమ ఖాతాను తెరిచింది. ప్రారంభ దశలోనే...