అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఘన విజయం
అశ్వారావుపేటలో కాంగ్రెస్ ఘన విజయం 22 వార్డుల్లో ఇప్పటికే 15 స్థానాలు కైవసం కాకతీయ, తెలంగాణ బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే 15 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీని దక్కించుకున్నారు. ప్రారంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ అభ్యర్థులు పలు వార్డుల్లో ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరిచారు. మెజార్టీకి అవసరమైన సంఖ్యను దాటడంతో అశ్వారావుపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి నియంత్రణ సాధించినట్లు స్పష్టమైంది. ఈ...