గూడుంబా నిర్మూలనకు ఎక్సైజ్ ఆకస్మిక దాడులు

గూడుంబా నిర్మూలనకు ఎక్సైజ్ ఆకస్మిక దాడులు కాకతీయ, నల్లబెల్లి : నాటు సారా నిర్మూలన లక్ష్యంగా నర్సంపేట ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని నందిగామ, రేలకుంట, లెంకాలపల్లి గ్రామాల్లో జిల్లా టాస్క్‌ఫోర్స్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా నాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న సుమారు 800 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా...