అల్ట్రాసౌండ్ కేంద్రాల తనిఖీ

అల్ట్రాసౌండ్ కేంద్రాల తనిఖీ లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కాకతీయ, కరీంనగర్: జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో బృందం కరీంనగర్ పట్టణంలోని పలు అల్ట్రాసౌండ్ కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేసింది. పీఓడీటిటి డాక్టర్ ఉమాశ్రీ, పీఓ ఎంహెచ్‌ఎన్ డాక్టర్ సన జవేరియా ఇతర సిబ్బంది పాల్గొన్న ఈ తనిఖీల్లో రిజిస్టర్లు, రోగుల అనుమతి పత్రాలు, కేసు రికార్డులు, సంబంధిత...