న్యాయ అవగాహనే రక్షణ కవచం

న్యాయ అవగాహనే రక్షణ కవచం కాకతీయ కరీంనగర్ : నేటి బాలలే రేపటి దేశ భవితవ్యమని, చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగినప్పుడే వారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ధైర్యంగా ప్రతిస్పందించగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బాల వివాహ రహిత భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన న్యాయ చట్టాల అవగాహన సదస్సు విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించింది. ఈ సందర్భంగా న్యాయవాదులు బాల్య వివాహాల వల్ల కలిగే తీవ్ర అనర్థాలను వివరించారు. బాల్య వివాహాల...