కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచారం
కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచారం పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు రఘునాథపాలెం, జానంపేట పరిసరాల్లో అప్రమత్తం ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు గిరిజనులు, రైతులు అడవికి వెళ్లవద్దని హెచ్చరిక కాకతీయ, మణుగూరు/కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రఘునాథపాలెం, జానంపేట–పొట్లపల్లి పరిసర అడవులతో పాటు రాళ్లవాగు ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు రైతులు, గిరిజనులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత రెండు రోజులుగా వ్యవసాయ...