నగర ప్రజల పక్షాన రాజీలేని పోరు
నగర ప్రజల పక్షాన రాజీలేని పోరు కాంగ్రెస్–బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లహరి శంకర్ కాకతీయ, కరీంనగర్ : నగర పాలకసంస్థ ఎన్నికల తీర్పును గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై రాజీ పడకుండా పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లహరి శంకర్ తెలిపారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని, తమకు మద్దతు తెలిపిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్‌లో బీజేపీ గెలిచిన 30 సీట్లలో 11 మంది...