పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం
పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం కాకతీయ,పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 22 వార్డుల్లో 13 వార్డులు కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో పట్టణ పాలనపై పట్టు సాధించింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ 6 వార్డులతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ 3 వార్డుల్లో విజయం సాధించింది. అయితే మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకునే స్థితిలో ఉంది. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, మౌలిక...