విలీన గ్రామాల సమస్యపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

విలీన గ్రామాల సమస్యపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన కాకతీయ వరస కథనాలతో చర్చ ముమ్మరం కాకతీయ,మణుగూరు టౌన్ : మణుగూరు పరిధిలో విలీనం చేసిన రాయిగూడెం,అన్నారం,కమలాపురం తదితర గ్రామాలకు కేంద్ర పథకాలు అందకపోవడంతో కాకతీయ వరస కథనాలతో ప్రజల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది.ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అమలు కాకపోవడంతో గత రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇప్పుడు గ్రామస్తులు బహిరంగంగా మాట్లాడుతున్నారు.ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన కాకతీయ పేపర్ కథనాల తరువాత గ్రామాల్లో చర్చలు మరింత ఉధృతమయ్యాయి.స్థానిక యువత,కార్మిక వర్గాలు,మహిళా సంఘాలు సమస్య...