విద్యా ప్రైవేటీకరణను ఆపాలి

విద్యా ప్రైవేటీకరణను ఆపాలి కేంద్రం వైఖ‌రికి వ్యతిరేకంగా గళమెత్తిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కాకతీయ, కరీంనగర్ : విద్యారంగాన్ని కేంద్రీకరించేలా ప్రతిపాదిస్తున్న ‘వికసిత భారత్ శిక్ష అభియాన్’ బిల్లును వ్యతిరేకించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ ప్రధాన కార్యదర్శి ముస్కుల రఘుశంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం టీఎన్జీవో భవనంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షత వహించారు. విద్యకు తగిన నిధులు కేటాయించకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తూ...