కరుణాపురం చర్చిలో చోరీ
కరుణాపురం చర్చిలో చోరీ అనుమానితుల ఫోటోలు విడుదల కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. కరుణాపురం గ్రామంలోని చర్చిలో ప్రార్థనలు ముగించుకుని బయటకు వచ్చిన మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు అపహరణకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ భీమారం ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఆదివారం కరుణాపురం చర్చిలో ప్రార్థనలకు హాజరయ్యారు. ప్రార్థనలు అనంతరం బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని మహిళలు ఆమె మెడలోని పుస్తెలతాడును చాకచక్యంగా అపహరించినట్లు తెలుస్తోంది....