తీర్దాల ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
తీర్దాల ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు కాకతీయ,ఖమ్మం బ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకాంక్షించారు. ఖమ్మం రూరల్ మండలం తీర్దాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని తన సతీమణి మాధవితో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, ట్రాఫిక్...