ఏర్పాట్లెలా ఉన్నాయి?
ఏర్పాట్లెలా ఉన్నాయి? ఇబ్బందులు ఎదురవుతున్నాయా? వేములవాడలో భక్తులతో ముచ్చటించిన ఇంచార్జి కలెక్టర్ శివరాత్రి జాతర సౌకర్యాలపై గరిమ అగ్రవాల్ ఆరా కాకతీయ, సిరిసిల్ల టౌన్: మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తుల మధ్యకు వెళ్లిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తుల స్పందనను నేరుగా తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం కల్పించిన సౌకర్యాలు భక్తులకు ఎంత వరకు ఉపయుక్తంగా ఉన్నాయో ఆరా తీశారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా,...