శంభుని సన్నిధిలో మంత్రి సురేఖ ప్రత్యేక పూజలు

శంభుని సన్నిధిలో మంత్రి సురేఖ ప్రత్యేక పూజలు కాకతీయ/ఖిలా వరంగల్,: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖిలా వరంగల్‌లోని శ్రీ స్వయంభూ శంభూలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం...