వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి
వైభవంగా సేవాలాల్ మహారాజ్ జయంతి బంధనపల్లి తండాలో ప్రత్యేక పూజలు ఆకట్టుకున్న గిరిజనుల సంప్రదాయ నృత్యాలు కాకతీయ,రాయపర్తి : మండలంలోని బంధనపల్లి తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అక్రీ రాంజీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ ఒక మతానికో,...