ఆలయాల్లో శివనామస్మరణం
ఆలయాల్లో శివనామస్మరణం మహాశివరాత్రికి పోటెత్తిన భక్తులు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో శివనామ స్మరణం మారుమోగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని వారి వారి మొక్కులను చెల్లించుకున్నారు. కొత్తగూడెంలోని రైటర్ బస్తీలో ఉన్న త్రిమాత గుడి, విద్యానగర్ కాలనీలోని శివాలయంలో భక్తుల రాకతో మహాశివరాత్రి శోభ నెలకొంది. శివభక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి తెల్లవారుజామున సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకాలు చేసి,...