ఘనంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు
ఘనంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు... పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, సిరిసిల్ల టౌన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ...