శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు కాకతీయ, పెద్దవంగర : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దవంగర మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఓం నమఃశివాయ’ నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోయాయి. పెద్దవంగర శివాలయంలో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో దీపాలు వెలిగించి తమ కోరికలు తీర్చాలని పరమశివుడికి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నవంగర, వడ్డెకొత్తపల్లి గ్రామాల్లోని...