మహాశివరాత్రికి నిరంతర విద్యుత్

మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ కరీంనగర్ సర్కిల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వడ్లకొండ గంగాధర్ కాకతీయ, కరీంనగర్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరా అందించినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వడ్లకొండ గంగాధర్ తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆలయాలు విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముందస్తుగా లోడ్ అంచనా వేసి ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచినట్లు,...