కొమరవెల్లి లో ఘనంగా పెద్ద పట్నం
కొమరవెల్లి లో ఘనంగా పెద్ద పట్నం *మల్లన్న నామస్మరణ చేస్తూ పట్నం తొక్కిన భక్తులు కాకతీయ, చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం లింగోద్భవ కాలంలో రాత్రి 12 గంటల తర్వాత స్వామివారికి మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు, సేవా కార్యక్రమాలను జరిపి సోమవారం ఉదయం రెండు గంటల నుండి దాదాపు నాలుగు గంటల వరకు పెద్దపట్నం...