ములుగులో ఇసుక లారీల అతి వేగం

ములుగులో ఇసుక లారీల అతి వేగం ప్రమాదాలకు తెరలేపుతున్న అక్రమ రవాణా అధిక లోడుతో రోడ్లపై దూసుకెళ్తున్న లారీలు వరుస ఘటనలతో భయాందోళనలో ప్రజలు ఫిర్యాదులున్నా స్పందించని అధికారులు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా పరిధిలో ఇసుక లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో రహదారులపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనుమతించిన పరిమితికి మించి ఇసుకను తరలించడం వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తాడ్వాయి మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామం మధ్యలో...