వైభవంగా శివ పార్వతుల కళ్యాణం
వైభవంగా శివ పార్వతుల కళ్యాణం *శివనామ స్మరణతో మార్మోగిన ఆలయం కాకతీయ,నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణ పండితుడు పోలుకొండ వెంకటేశ్వర శర్మ,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేంద్ర శర్మ, కృష్ణ మోహన శర్మ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఆలయ పునర్ వ్యవస్థాపకులు అన్నావజ్జుల సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.మహాశివరాత్రిని పురస్కరించుకొని వేకువ జామునే భక్తులుఅభిషేకాలు,అర్చనలు,అష్టోత్తర శతకలష పూజ,పూర్ణాహుతి హోమానికి బారులు తీరారు.ఈఉత్సవాలలో భాగంగా...