కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం
కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం గుర్తుతెలియని వ్యక్తి మృతి కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పట్టాలపై ఓ వ్యక్తి శరీరం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని...