వెన్నుపోటు రాజకీయాలు సహించబోము-మంత్రి సీతక్క
వెన్నుపోటు రాజకీయాలు సహించబోము-మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని కాంగ్రెస్ కౌన్సిలర్లను అభినందించారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లందరినీ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ, ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి చైర్‌పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళ బిక్షపతిని ఎన్నుకున్నామని...