కేసీఆర్‌ తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక: కేటీఆర్‌

కేసీఆర్‌ తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక: కేటీఆర్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పంతో 2001లో గులాబీ జెండా ఎగురవేసిన సమయంలో పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో గుర్తుచేసుకున్నారు. ఆ...