పాత్రికేయుడిని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

పాత్రికేయుడిని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి కాకతీయ, దుగ్గొండి: వార్త దినపత్రిక నర్సంపేట ఆర్సీ ఇంచార్జ్ రండం శ్రీనివాస్ తండ్రి రడం సారయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆయన స్వగ్రామమైన తిమ్మంపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సారయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. సారయ్య మృతితో కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందని పేర్కొన్నారు....