బుర్కా ధరించి కోరుట్ల బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి పట్టివేత
బుర్కా ధరించి కోరుట్ల బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి పట్టివేత కాకతీయ జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో బుర్కా ధరించి తిరుగుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు, మహిళల మధ్య కూర్చొని అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడని గమనించిన సిబ్బంది అతడిని ప్రశ్నించారు. ఆ వ్యక్తి పేరు మహమ్మద్ తారిక్ హుస్సేన్‌గా గుర్తించారు. మహిళల సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో, పసిపిల్లలు లేదా మహిళలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది...