కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ అప్రమత్తమైన పోలీసులు – ఖాళీ చేసిన కోర్టు ప్రాంగణం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కోర్టును పేల్చివేస్తామని పేర్కొంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బుధవారం కోర్టుకు ఈమెయిల్ ద్వారా వచ్చిన హెచ్చరికతో పోలీసులు వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపించారు. అనంతరం డాగ్ స్క్వాడ్‌, బాంబు డిస్పోజల్ బృందాలతో కలిసి...