చెక్‌డ్యామ్‌ల పరిధిలో ఇసుక తవ్వకాలకు నిషేధం

చెక్‌డ్యామ్‌ల పరిధిలో ఇసుక తవ్వకాలకు నిషేధం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ స్పష్టం కాకతీయ, కరీంనగర్ : జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నదులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ల వద్ద భద్రతా దృష్ట్యా డ్యామ్‌కు ఎగువన, దిగువన 300 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఈ నిబంధనల అమలును అధికారులు కట్టుదిట్టంగా...