బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు

బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు మానకొండూరులో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ అవగాహన సదస్సు కాకతీయ, కరీంనగర్ : బాలల హక్కులను ఉల్లంఘించే చర్యలపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని, బాలల రక్షణకు న్యాయవ్యవస్థ అజేయ కవచంలా నిలుస్తుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. మానకొండూరులోని పీఎంస్రీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కార్యక్రమం భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు నిర్వహించిన...