ఏటూరునాగారంలో దొంగల బెడద

ఏటూరునాగారంలో దొంగల బెడద చిన్న చిన్న డబ్బాలే టార్గెట్! కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం కేంద్రంలో దొంగల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాళాలు వేసి మూసివేసిన షాపులనే లక్ష్యంగా చేసుకుని దుండగులు రాత్రి వేళల్లో తాళాలు పగులగొట్టి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం, దొంగలు పగటి పూట షాపుల పరిస్థితిని గమనించి, రాత్రి సమయాల్లో అమలు చేస్తూ తాళాలు పగులగొట్టి నగదు, చిన్నచిన్న సరుకులను ఎత్తుకెళ్తున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న డబ్బాలే టార్గెట్‌గా చేసుకుని...