గర్మిళ్లపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
గర్మిళ్లపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు కాకతీయ, ఐనవోలు : హనుమకొండ జిల్లా, ఐనవోలు మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామంలో గ్రామ చరిత్రలో తొలిసారిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో దేశభక్తి వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ సందర్భంగా బాలబోయిన ఆనంద్ ధర్మరాజ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షకుడిగా శివాజీ మహారాజ్ ఎన్నో త్యాగాలు, కష్టాలు ఎదుర్కొని సనాతన ధర్మాన్ని స్థాపించి కాపాడిన మహానుభావుడని తెలిపారు. నేటి కాలంలో సనాతన ధర్మం పట్ల అవగాహన...