చిన్న వివాదం ఘర్షణగా మారి కత్తిపోటు
చిన్న వివాదం ఘర్షణగా మారి కత్తిపోటు ముగ్గురికి తీవ్ర గాయాలు కాకతీయ, గోదావరిఖని: చిన్న వివాదం తీవ్ర ఘర్షణగా మారి కత్తిపోట్ల ఘటనకు దారి తీసిన సంఘటన గోదావరిఖని మార్కండేయ కాలనీలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరిగిన ఈ గొడవలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఇంటి ముందు వ్యాపారం చేస్తున్న సమయంలో కస్టమర్లు సిగరెట్లు తాగడం వల్ల ఇంట్లోకి పొగ వస్తోందన్న కారణంగా కుటుంబ సభ్యుల...