గ్రామపంచాయితీ పాలనపై అవగాహన పెంపొందించుకోవాలి
గ్రామపంచాయితీ పాలనపై అవగాహన పెంపొందించుకోవాలి *జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి కాకతీయ,గీసుగొండ: గ్రామాల అభివృద్ధిలో పాలనా అంశాలపై సర్పంచులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు. గంగాదేవిపల్లి గ్రామంలో సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచులు పాలనా పరమైన నిర్ణయాలు చట్టబద్ధంగా, పారదర్శకంగా తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయి అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, సమావేశాల నిర్వహణ, తీర్మానాల అమలు వంటి అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు....