విద్యార్థులే ఉపాధ్యాయులుగా

విద్యార్థులే ఉపాధ్యాయులుగా నర్సింహులగూడెం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని నర్సింహులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించిన విద్యార్థిని నందిని మాట్లాడుతూ హెచ్‌ఎం బాధ్యతలు నిర్వహించడం గర్వంగా అనిపించిందన్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధనలో పడే కృషి ఎంత గొప్పదో ఈ కార్యక్రమం ద్వారా...