రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన
రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాకతీయ, రామకృష్ణాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ శనివారం క్యాతన్‌పల్లి నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని...