కౌన్సిలర్లు అప్రమత్తం… కమిషనర్ నిర్లక్ష్యం?
కౌన్సిలర్లు అప్రమత్తం… కమిషనర్ నిర్లక్ష్యం? డ్రైన్ల నుంచి తీసిన మురికి రోడ్లపైనే… డంపింగ్ యార్డ్‌కు తరలింపు లేదు పారిశుద్ధ్యంపై కౌన్సిలర్ల చొరవ… అధికారుల అలసత్వంపై ప్రజల ఆగ్రహం కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ మున్సిపాలిటీలో కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టిన వెంటనే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమ వార్డుల్లో పేరుకుపోయిన చెత్త, డ్రైన్లలో ఉన్న మట్టిని తొలగించి మురుగు నీరు సాఫీగా పారేలా చర్యలు చేపడుతున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే...