ఏజెన్సీలో గోవుల అక్రమ రవాణా..!

ఏజెన్సీలో గోవుల అక్రమ రవాణా..! అర్ధరాత్రి వాహనాల్లో హైదరాబాద్ కబేళాలకు తరలింపు సర్పంచ్ అనుమతి పత్రాలపై అనుమానాలు.. అధికారుల మౌనం చర్చనీయాంశం కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గోవుల అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం ప్రధాన రహదారుల మార్గంగా అర్ధరాత్రి వేళల్లో డీసీఎం, బొలేరో వంటి వాహనాల్లో గోవులను హైదరాబాద్‌లోని కబేళాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ఈ తరలింపు జరుగుతోందా..? లేక అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోందా..?...