37వ డివిజన్ అభివృద్ధి పనులకు వేగం పెంచాలి
37వ డివిజన్ అభివృద్ధి పనులకు వేగం పెంచాలి కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ 37వ డివిజన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ కోరారు. ఈ మేరకు ఆమె గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బజపేయ్‌ను కలిసి డివిజన్‌లోని సమస్యలు, పనుల పురోగతిపై చర్చించారు. డివిజన్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల పనులు ఆలస్యం కాకుండా నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు....