వానరాల బెడదకు ఎలుగుబంటి ‘అస్త్రం’

వానరాల బెడదకు ఎలుగుబంటి ‘అస్త్రం’ మాస్క్ చూసి పరుగులు పెట్టిన కోతులు కరీంపేట పంచాయతీ వినూత్న ప్రయత్నం కాకతీయ, శంకరపట్నం : కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఉపశమనం కల్పించేందుకు కరీంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న చర్య చేపట్టింది. ఇండ్లపైకి ఎక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్న వానరాలను తరిమేందుకు ఎలుగుబంటి వేషాన్ని ఆశ్రయించింది. గ్రామంలో పెరిగిపోతున్న కోతుల సంఖ్యతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పంచాయతీ ఎలుగుబంటి మాస్క్‌ను తెప్పించింది. ఆ మాస్క్‌ను ఓ వ్యక్తికి ధరింపజేసి గ్రామంలోని పలు వార్డుల్లో...