ఒకవైపు పెద్దపులి… మరోవైపు చిరుత!
ఒకవైపు పెద్దపులి… మరోవైపు చిరుత! గజగజ వణుకుతున్న రాజన్న సిరిసిల్ల గ్రామాలు పాడి పశువులపై వరుస దాడులు ట్రాప్ కెమెరాలతో అటవీశాఖ నిఘా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచనలు కాకతీయ, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అడవి మృగాల సంచారం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఒకవైపు చిరుతపులి, మరోవైపు పెద్దపులి గ్రామాల సమీపంలో సంచరిస్తుండటంతో అటవీ ప్రాంత పల్లెల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ముఖ్యంగా పాడి పశువులపై దాడులు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని హనుమక్కపల్లిలో అర్ధరాత్రి...