తురకగూడెంకు తాగునీటి శాశ్వత పరిష్కారం

తురకగూడెంకు తాగునీటి శాశ్వత పరిష్కారం సొంత బోరుబావి నీటిని గ్రామానికి మళ్లించిన సర్పంచ్ పనుల్లో స్వయంగా పాల్గొని ఆదర్శంగా నిలిచిన బుర్ర కృష్ణ కాకతీయ, కూసుమంచి : తురకగూడెం గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్పంచ్ బుర్ర కృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. గ్రామంలో సరైన బోరుబావి లేకపోవడంతో ఇంతవరకు పాలేరు నుండి వచ్చే మిషన్ భగీరథ నీటిపైనే ప్రజలు ఆధారపడి ఉండేవారు. పైప్‌లైన్లలో లోపాలు తలెత్తితే సరఫరా నిలిచిపోవడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గ్రామ సమస్యను గమనించిన...