గ్రామ సమగ్రాభివృద్ధికి మహిళా నాయకత్వమే బలం
గ్రామ సమగ్రాభివృద్ధికి మహిళా నాయకత్వమే బలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత తిరుపతి కాకతీయ, శంకరపట్నం : గ్రామ సమగ్ర సంక్షేమ సాధనలో మహిళా నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత తిరుపతి పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఈనెల 16 నుంచి 19 వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళా నాయకుల సామర్థ్యాలను పెంపొందించడం, స్థానిక పాలనలో...