ఘనంగా బీరప్ప కామరాతి కల్యాణం

ఘనంగా బీరప్ప కామరాతి కల్యాణం కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బండారి శ్రీశైలం-సంతోష కుటుంబ సభ్యులు నిర్వహించిన బీరప్ప కామరాతి కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. బియ్యం సుంకు, డోలు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల విన్యాసాల మధ్య లింగాలకు గంగస్నానం చేయించి శ్రీశైలం సంతోష నివాసానికి తీసుకొచ్చారు. ఇంటి ఆవరణలో పెద్దపట్నం వేసి బీరప్ప- కామరాతి కల్యాణాన్ని వేడుకగా జరిపించారు. అంతకుముందు మహిళలు బోనాలతో శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు చేశారు.బీరప్ప వేడుకలకు కుర్మ సంఘం...