అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న సర్పంచ్
అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న సర్పంచ్ *జేసీబీ,మూడు ట్రాక్టర్లు సీజ్ *నలుగురిపై కేసు నమోదు *తప్పుడు ప్రచారాన్ని ఖండించిన గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ కాకతీయ, గీసుగొండ: కొమ్మాల జాతర అభివృద్ధి పనుల నెపంతో సూర్య తండా గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ కట్ట నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక సర్పంచ్ రాఘవేంద్ర అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది.జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి మూడు ట్రాక్టర్లలో తరలిస్తున్న వారిని సర్పంచ్ నిలదీశారు....