అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా ఆశ్రమ జూనియర్ కళాశాల సందర్శన కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ జూనియర్ కళాశాలను పీఓ చిత్ర మిశ్రా సందర్శించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ప్రిన్సిపాల్, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. ఆశ్రమ జూనియర్ కళాశాల తాడ్వాయి, జగ్గన్నపేట పరీక్షా కేంద్రాల్లో పరీక్షా ప్యాడ్‌లు, స్టేషనరీ కిట్‌ల కొరతను గుర్తించి, తక్షణమే పరీక్షా...